మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆదివారం మధ్యాహ్నం ఉపరితల గని పై ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీలో చేరారు. అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణ కార్మికుల హక్కుల సాధన ఏఐటిసి తోనే సాధ్యమవుతుందని, సింగరేణి లో దాదాపు 33, వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వారంతా శ్రమ దోపిడీకి గురవుతున్నారని సింగరేణి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో యజమాన్యం వైఫల్యం చెందిందన్నారు