ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మూడు కోణాల విధానంలో (అండర్ స్టాండింగ్, ఇంటరాక్షన్, ప్రాక్టికల్ నాలెడ్జ్) పాఠ్యాంశాలను బోధించాలనీ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సభా భవన్ హాల్లో మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి,రామచంద్రా రెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.