యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు బిజెపి కాంగ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు.రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల సాగు త్రాగునీరు విద్యా వైద్యం అందుబాటులో లేకుండా పోతుందన్నారు.