ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున ఒకటి తర్వాత చంద్రగ్రహణం ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు ఆలయ అర్చకులు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి భద్రకాళి ఆలయాన్ని శుద్ధి శుద్ధి చేశారు ఆలయ సిబ్బంది. అమ్మవారి రాజగోపురం నుండి మొదలుపెడితే ఆలయం మొత్తం శుద్ధి చేశారు. మరి కాసేపట్లో ఏడున్నర గంటలకు భద్రకాళి అమ్మవారిని ప్రత్యేక పూజల అనంతరం భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు ఆలయ అర్చకులు.