సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని సిద్దిపేట జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 206 సంఘాలతో ఏర్పాటైన జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ లలిత కళాతోరణం లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన పాత పెన్షన్