మైలార్దేవ్ పల్లిలోని పరుపుల గోదాంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన చోటుచేసుకుంది. టాటా నగర్ లోని పరుపుల గోదాంలో ఒకసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పరుపుల గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.