మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూరులోని ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంపై కలెక్టర్ విజయేందిర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, పరిశుభ్రత పాటించకపోతే డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శిపై మండిపడ్డారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.