ప్రజా సమస్యలను పాలకులు వెంటనే పరిష్కరించాలని లేకుంటే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు హెచ్చరించారు. బుధవారం చివ్వెంల మండల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చివ్వెంల మండల కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 2 వరకు ప్రజా సమస్యలపై నిర్వహించిన సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని చివ్వెంల తహసిల్దార్ కార్యాలయం ముందు మహా ధర్నాచేపట్టారు.