కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి రైతాంగ సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి పార్టీ సిద్ధమైందని తెలిపారు. అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. లోకేష్ తిరిగి పరిశ్రమల ప్రారంభోత్సవం చేయడం హాస్యాస్పదమని, నాడు-నేడు ద్వారా అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసిన ఘనత జగన్ దేనని అన్నారు.