శనివారం ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో, న్యాయమూర్తి సుష్మ ఇరు కక్షిదారులకు సూచనలు చేశారు. క్షణికావేశంలో గొడవపడి, కేసులంటూ కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, రాజీమార్గమే సరైనదని ఆమె తెలిపారు. ఈ అదాలత్లో ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి మండలాల నుంచి వచ్చిన పరిష్కరించదగిన కేసులను పరిష్కరించి తీర్పులు ఇచ్చారు.