గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తనను ఫోన్ లో బండ బూతులు తిట్టాడని సీపీఎం అనుబంధ సంఘం ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ సంస్థకు భూములను అప్పగిస్తున్న రైతుల గురించి తెలుసుకోవడానికి మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించామన్నారు. రైతుల సమస్యలను అడుగుతుండగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఫోను ద్వారా రైతు సంఘం నాయకులను బండ బూతులు తిట్టారన్నారు. ఓట్లు వేసి అధికారం ఇచ్చిన ప్రజలకు పంగనామాలు పెట్టి సోలార్ పరిశ్రమకు అనుకూలంగా వ్యాఖ్యానించడం తగదన్నారు.