అనకాపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాల ఎ.కామ్ విభాగం పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సమావేశానికి పూర్వ విద్యార్థిగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరయ్యారు. 1973–2021లో చదివిన విద్యార్థులు సమావేశం అయ్యారు. కొణతాల 1977-79కి చెందిన పూర్వ విద్యార్థి. అందరూ ఒకరినొకరు పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. గత స్మృతులను తలుచుకుని పులకించారు.