వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి అంబేద్కర్ కూడలి వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని వరంగల్ వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపర్తి మండలం మహబూబ్నగర్ గ్రామానికి చెందిన దూడయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఇరువురిని స్థానికులు వర్ధన్నపేటలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.