గాంధారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 46 మంది విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. వైద్య శాఖ ఆదేశాల మేరకు స్కూల్లో 46 మందికి పరీక్షలు చేసి 11 మందికి కంటి సమస్యలు గుర్తించి కంటి అద్దాలు తీసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ చంద్ర, ANM షబానా బేగం, సిబ్బంది ఉన్నారు.