మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో సింగరేణి స్థాయి 49వ రక్షణ త్రైపాక్షిక సమావేశాన్ని అధికారులు ఆదివారం నిర్వహించారు. డిజీఎంఎస్ ఉజ్వల్ థా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజల్వన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బొగ్గు గనుల్లో ప్రమాదాలపై సమీక్షించారు. సింగరేణి డైరెక్టర్లు, జిఎం, సేఫ్టీ అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.