చింతపల్లి మండలంలోని తాజంగి అటవీ సెక్షన్ ఆఫీసర్ గా పీ.ఎరుకులమ్మ శుక్రవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఎరుకులమ్మ ఇప్పటి వరకూ కృష్ణాదేవిపేట అటవీశాఖ పరిధిలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ గా పనిచేశారు. ఉన్నతాధికారులు సెక్షన్ ఆఫీసర్ గా ప్రమోషన్ కల్పించి, తాజంగి బదిలీ చేశారు. ఈమేరకు ఎరుకులమ్మ తాజంగి అటవీ సెక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించారు.