కనిగిరి పట్టణంలో పారిశుధ్య సమస్యల పట్ల సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు. శనివారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7,8 వాటిలలో మునిసిపల్ చైర్మన్ పర్యటించగా పారిశుధ్య సమస్యలపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ స్పందిస్తూ.... పారిశుద్ధ్యం లోపిస్తే ప్రజలకు వ్యాధులు ప్రజలే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని చైర్మన్ ఆదేశించారు