గాంధారి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన శంషుద్దీన్( 35 )ఆదివారం రాత్రి పశువులను కొట్టుకొని పొలం నుంచి తన స్వగ్రామం మేడిపల్లి కి వస్తుండగా, గాంధారి నుంచి బాన్సువాడకు వెళ్ళు రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో రెండు కాళ్ళు విరిగిపోయి తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గాయపడిన వ్యక్తిగత బంధువు కరీమాబి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.