నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు గర్బనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం అదన కలెక్టర్ అధ్యక్షతన పిసిపి ఎన్డిటి ఆక్ట్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనం కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేదితం అన్నారు. పి సి పి ఎన్ డి టి యాక్ట్ అమల్లో ఉందని అందుకు సంబంధించిన గోడప్రతులను ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని అన్నారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల, అధికారులు పాల్గొన్నారు.