పంట, ఇండ్లు నష్టపోయిన బాదితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జైనథ్ మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని పెండల్ వాడ, ఆనంద్ పూర్, సాంగ్వి, కరంజి గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగి రైతులను, ప్రజలను ఓదార్చారు. ఇటీవల భారీ వర్షాల ధాటికి దెబ్బ తిన్న పంటపొలాలు రోడ్లు, బ్రిడ్జి లను పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం తప్పకుండ ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.