తమ డిమాండ్ల సాధన కొరకు సచివాలయ ఉద్యోగులు గుత్తి మున్సిపల్ ఆఫీస్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు వినయ్, ప్రశాంత్, వెంకట్, కిరణ్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం తమకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. నాలుగు డి ఏ లు కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులను వాలంటీర్ పనులకు వినియోగించుకుంటున్నారన్నారు. తమకు న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు.