వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి మరియు రాంపూర్ గ్రామాల రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం 1:00 వరకు యూరియా కోసం రైతులు బారులు తీరారు. టోకెన్లు ఇవ్వడం లేదని రైతులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో రైతు వేదిక వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సీజన్ దాటిన తర్వాత కూడా యూరియా ఎందుకు పంపిణీ చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. కావున రైతులందరికీ యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.