రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచల్లూరు గేటు సమీపంలో కల్వకుర్తి ఆర్టీసీ బస్సుపై కొంతమంది దుండగులు అమానుషంగా దాడి చేసి బస్సు అద్దాలు పగలగొట్టారు. వందమందికి పైగా యువకులు కత్తులు, తల్వార్లతో రోడ్డుపై నానా హంగామా సృష్టించి బస్సు పై దాడి చేశారు. దాడిలో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు. ఏమి తోచని పరిస్థితుల్లో ఉండి పోయారు. ఇలాంటి వారి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.