కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టినట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు కింద పడిపోవటంతో ఒకరి తలకు తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ద్విచక్ర వాహన దారులు మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.