అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయం నుంచి శుక్రవారం ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలంటూ తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ మహబూబ్ బాషా వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలల అయినప్పటికీ ఉపాధ్యాయ హామీలను నెరవేర్చలేదని వెంటనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.