శ్రీ భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామల సునీత ఈరోజు దేవాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ దేవాలయము మరియు దేవాలయ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచనలు జారీ చేశారు.