పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం సీసలి గ్రామంలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గా గణేశ్న పద్మారావు మరియు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నూతన కమిటీని అభినందించారు. కాళ్ళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆరేటి రత్న ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.