జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. గ్రామ స్థాయిలో పర్యటించి రానున్న 15రోజుల్లో పాఠశాలల్లో విద్యార్థులను భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అలాగే ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.