జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్ కాలనీలోని కాలనీవాసులు గత 15 సంవత్సరాలుగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథునికి పూజలు చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్కచేయకుండా భక్తిశ్రద్ధలతో గణనాథుడికి తొలి పూజను గ్రామస్తులు చేశారు.