సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్ లు,ఫీల్డ్ అసిస్టెంట్ లు తమ తమ వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ బారి వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన గృహాలను సైతం గుర్తించడం జరుగుతుందని బుధవారం సిద్దిపేట మున్సిపల్ అధికారులు తెలిపారు . అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలోని 38 వార్డు బోయి గల్లీలో శిథిలావస్థలో ఉన్న గృహం యొక్క పైకప్పు కూలిపోవడంతో వెంటనే విపత్తు నిర్వహణ బృందం వారికి సమాచారం అందించి వారి సహాయంతో తక్షణమే వృద్ధ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందన్నారు.