బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద ఆదివారం సాయంత్రం తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నలబోయినపల్లికి చెందిన కౌశిక్ ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన సాంబ పై కట్టకింద పల్లి కి చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథ చౌదరి తన అనుచర్లతో దాడి చేసి గాయపరిచాడు గాయపడ్డ వారిని స్థానికులు ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు.బొగ్గుల తయారీ యజమానుల నుండి కమిషన్ల కోసమే గొడవ జరిగినట్లు తెలిసింది.