కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి ఇవ్వడం వలన కోటా సీట్లు సగానికి తగ్గిపోతాయని విదసం (విస్తృత దళిత సంఘాల)ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు అన్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం విశాఖ అంబేద్కర్ భవన్లో మెడికల్ సీట్లను ఏపీ విధానంలో ప్రైవేటు వారికి ఇవ్వద్దంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మెరిట్ వచ్చిన వారు ప్రభుత్వ కళాశాలలో సీటు వస్తే ఫీజు లేదని,ఈ ప్రభుత్వ కళాశాలలు పీపీపీ కి వెళితే కన్వీనర్ కోటా లో సీటు పొందే అన్ని వర్గాల వారికి లబ్ది చేకూరుతుందన్నారు.