ఎమ్మిగనూరు: గొర్రెలకు మేతగా వదిలేసిన ఉల్లి పంట..ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డికి చెందిన రైతు హకీమ్ మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు. కానీ ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే మూగజీవాలకు మేతగా వదిలేశాడు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి మొత్తం రూ.3 లక్షలు నష్టపోయానని వాపోయాడు. ప్రస్తుతం ఉల్లికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఇలా మూగజీవాలకు మేతగా వదిలినట్టు తెలిపాడు.