జీ.మాడుగుల మండలంలోని సొలభం పంచాయతీ మల్లిపాడు గ్రామానికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే! ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు నిత్యావసర సరుకులు కోసం బయటకు రావడం తప్పడం లేదు. వాగుకు ఆనుకుని ఉన్న చెట్లపై కర్రలతో వంతెన వేసుకున్న గిరిజనులు, ఆ వంతెనపై ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతున్నారు. రహదారి, వంతెన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు.