పలమనేరు: పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రధాన రహదారులంతా ప్రజలతో కిక్కిరిసి కోలాహలంగా మారింది. ముఖ్యంగా జవిలి వీధి,బజార్ వీధి, మారెమ్మ గుడి వీధి, గంగమ్మ గుడి వీధి శివాలయం పరిసరాలు, సంత,ఎంబిటి రోడ్డు బిజీగా మారాయి. నిత్యవసరాలు మరియు వినాయక చవితి పండుగకు కావాల్సిన పూజ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. జన సందోహం ఎక్కువ అవ్వడంతో పోలీసులు సైతం ఘటన ప్రాంతానికి చేరుకుని ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు.