రైతులు సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలోని దర్శిని జీన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైతులు తమ పండించిన పంటలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు.