ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సాత్ నంబర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన గిరిధర్, ఆయన భార్య, కుమార్తెతో కలిసి నిర్మల్ నుంచి ఆదిలాబాద్కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఇచ్చోడ మండలం సాత్ నంబర్ సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు.