మడకశిర పట్టణంలో వివిధ వార్డుల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదివారం సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల సభ్యులకు ఆయన కీలక సూచనలు చేశారు. వినాయక చవితి పండుగ దిగ్విజయంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అని అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాన్ని సైతం పటిష్టంగా విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.