హుజరాబాద్: పట్టణంలో గురువారం రాత్రి సుమారు మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది ఎంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి మామిళ్ళ వాడ తో పాటు పలు కాలనీలో భారీగా వర్షం నీరు ఇండ్లలోకి చేరడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడ్డారు చేసేదేం లేక కొందరు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు దీనికి తోడు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పట్టణమంతా అందాకారంలో ఉండిపోయింది . గురువారం వారసంత కావడంతో రోడ్లపై కూరగాయలు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి ఇంకా రాత్రి భారీ వర్షం కురుస్తుందన్న వార్తల ప్రచారం నేపథ్యంలో పట్టణవాసులు బిక్కువిక్కుమంటూ భయపడుతున్నారు.