జీ.మాడుగుల మండలంలోని భీరం పంచాయతీ అనర్భ గ్రామ సమీపంలో 350 కేజీల గంజాయి పట్టుబడిందని జిల్లా అదనపు ఎస్పీ ధీరజ్ శుక్రవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో తెలిపారు. ముందస్తు సమాచారంతో జీ.మాడుగుల ఎస్సై షణ్ముఖరావు తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో, బైక్‌పై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.