Download Now Banner

This browser does not support the video element.

నరసాపురం: జగన్నాధపురం దగ్గర వంతెన కూలిపోయిన ఘటనను ప్రత్యక్షంగా పరిశీలించిన ప్రభుత్వ విప్ నాయకర్

Narasapuram, West Godavari | Aug 24, 2025
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని జగన్నాధపురం దగ్గర వంతెన కూలిపోయిన ఘటనను ప్రత్యక్షంగా ప్రభుత్వ విప్, మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అధికారులతో చర్చించి త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us