తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు రాగం దేవేందర్ యాదవ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పరామర్శించారు.ఇటీవల దేవేందర్ యాదవ్ తండ్రి రాగం కొమర్య యాదవ్ అనారోగ్యంతో మృతి చెందగా, ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ ఎంపీటీసీ నరసింహ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.