విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విడుదల చేసిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వెంటనే దానిని రద్దు చేసుకోవాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. మహాధర్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం నుంచి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వాసిత ప్రాంతాలలో బైక్ ర్యాలీలు పాదయాత్రలు చేపట్టారు. అగనంపూడి కూర్మన్నపాలెం వడ్లపూడి పెదగంటియాడ స్టీల్ ప్లాట్ తదితర ప్రాంతాలలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.