తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 9 మందికి రూ.7,66,064ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అర్హులకు సహాయం అందిస్తోందని తెలిపారు.