కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీల నిర్వహకులతో కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.... గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవ కమిటీల నిర్వాహకులు నిర్వహించాలన్నారు. గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరిగినా ఉత్సవ కమిటీల నిర్వాహకులను బాధ్యులను చేస్తామన్నారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కనిగిరి సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ పాల్గొన్నారు.