కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం గుంటూరు 53వ డివిజన్లోని వెంగళరావునగర్ లో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ఏటీఎం కార్డు తరహాలో ఆధునిక టెక్నాలజీతో, క్యూఆర్ కోడ్లతో స్మార్ట్ కార్డులను అందిస్తున్నామన్నారు. ఇకపై ఈ కార్డులపై ప్రభుత్వ చిహ్నాలు మాత్రమే ఉంటాయి తప్ప, రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.