వీ.కోట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హంద్రీనీవా కార్యక్రమం కుప్పంకు నీరు నిలిచిపోయాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ కాగా, వీ.కోట మండల కేంద్రం పంప్ హౌస్ వద్ద హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్. ఈ విటల్ ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు. హంద్రీనీవా లిఫ్టింగ్ ప్యానెల్ లో అంతరాయం కలిగింది, మరమ్మతుల అనంతరం కొంత విరామం తర్వాత యధావిధిగా నీటి ప్రవాహం జరుగుతోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో గిట్టని వారు పెట్టిన పోస్టులను ఎవరు నమ్మద్దు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు హంద్రీనీవా ద్వారా ప్రతి చెరువును నింపుతామన్నారు.