పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు, వైసీపీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు, వైసీపీ నాయకులు రాజు, కొండయ్య, నందమూరి ఆంజనేయులు, బోకూరి విజయ రాజు, బలే యేసు బాబు, గునుపూడి యూత్ వారు పాల్గొన్నారు.