నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రొబిషనర్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఇన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బంది బుధవారం గోశాల రోడ్డులో రూట్ వాచ్ నిర్వహించారు. కోజా కాలనీకి చెందిన అబ్దుల్ మాలిక్ దేవాని అనే వ్యక్తి తన స్కూటీలో అక్రమంగా కృత్రిమ కళ్ళు తయారీలో వాడే నిషేధిత అల్ఫోజోలంను తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 609 గ్రాముల అల్ఫోజోలంను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.