ప్రతి పేద ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని విడతలవారీగా అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు వరంగల్ పర్యటన ఉన్న మంత్రి కొండా సురేఖ ఈస్ట్ నియోజకవర్గం లబ్ధిదారులకు తన క్యాంప్ ఆఫీస్ లో ఇందిరా మైలు సాంక్షన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.